చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

0
102

సిరిసిల్ల న్యూస్:

సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటి నుండి నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు.

గురువారం రోజున జిల్లెళ్ల,వెంకట్రావుపల్లి-బదనకల్,పెద్దమ్మ చెక్ పోస్ట్ లను తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

ఎస్పీ గారి వెంట డీఎస్పీ ఉదయ్ రెడ్డి ,చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here