పోలీసులు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి, అదనపు ఎస్పీ చంద్రయ్య…

0
44

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణను పాటిస్తూ, ప్రజల మెప్పు పొందేలా పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో ఆర్మూడ్ రిజర్వ్ (AR), సివిల్ మరియు హోమ్ గార్డ్ సిబ్బందికి ‘వీక్లీ పరేడ్’ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ మరియు ట్రాఫిక్ డ్రిల్స్‌ను అదనపు ఎస్పీ స్వయంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీక్లీ పరేడ్ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, ఇది సిబ్బందిలో ఐక్యతను, శారీరక దృఢత్వాన్ని మరియు వృత్తిపరమైన క్రమశిక్షణను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు.

ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట పాటు వాకింగ్ లేదా వ్యాయామం నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని నివారించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎస్పీ సూచనల మేరకు సిబ్బంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. “సిబ్బందికి ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు ఉంటే నిస్సంకోచంగా నన్ను కలిసి విన్నవించుకోవచ్చు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు, సి.ఐ లు కృష్ణ, మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, సాయి కిరణ్, జునైద్ మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here