సెస్​ చైర్మన్​ వర్సెస్ తంగళ్లపల్లి​ సర్పంచ్​ ల ఫోరం

0
117

ఏకగ్రీవ తీర్మాణాలు.. బీఆర్​ఎస్​ నేతల మధ్య పంచాయతీ

తీరు మార్చుకోని సెస్​ చైర్మన్​ చిక్కాల.. గెలిపుకు కృషి చేసిన నేతలనే దూరం పెడుతున్నడు

సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడిని పిలవకుండానే కుల సంఘాల ఏకగ్రీవ తీర్మాణాలు

సొంత  గ్రామంలో సర్పంచ్​ వేణుగోపాల్​రావుకు ఆహ్వానం కరువు

ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్​కు తలనొప్పులు తెస్తున్న సెస్​ చైర్మన్​ చిక్కాల

అలిగిన వేణుగోపాల్​ రావు.. బుజ్జగించిన బీఆర్​ఎస్​ నేతలు

ఇద్దరి పంచాయతీ బీఆర్​ఎస్​ అధిష్టానం వద్దకు

సిరిసిల్ల న్యూస్​: తంగళ్లపల్లి మండలం:

సిరిసిల్ల సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావు

రాజన్నసిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్​ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో బీఆర్​ఎస్​ లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సిరిసిల్ల సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావు ఏకపక్ష నిర్ణయాలు.. మండల ప్రజాప్రతినిధులను కొంత మందిని దూరం పెట్టి గ్రూపు రాజకీయాలకు తెరలేపినట్లు చర్చ కొనసాగుతుంది. చిక్కాల రామారావును సెస్​ డైరక్టర్​గా గెలిపించడానికి కృషి చేసిన వారినే దూరం పెడుతూ.. కార్యక్రమాలకు ఆహ్వనించకుండా అవమానపరడంతో తంగళ్లపల్లి మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షులు వలకొండ వేణుగోపాల్​ రావు తీవ్ర ఆవేధనకు గురయ్యారు. వేణుగోపాల్​ రావు సర్పంచ్​ గా ప్రతినిధ్యం వహిస్తున్న కస్బె కట్కూర్​ గ్రామంలో గౌడ, యాదవ సంఘాలు బీఆర్​ఎస్ కు ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపి.. కేటీఆర్​ కే మా ఓటు అని శనివారం ఏకగ్రీవ తీర్మాణాలు చేయించే కార్యక్రమానికి అదే గ్రామ సర్పంచ్​ ఐన వలకొండ వేణుగోపాల్​ రావు కు సమాచారం ఇవ్వలేదు. గ్రామం మొత్తం ఏకగ్రీవ తీర్మాణం చేయించే పనిలో సర్పంచ్​ వేణుగోపాల్​రావు కసరత్తు చేస్తుండగా రెండు సామాజిక వర్గాలను కస్బె కట్కూర్​ నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి పిలిపించుకోని ఏకగ్రీవ తీర్మాణాల కార్యక్రమంను సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావు నిర్వహించారు. తన సొంత గ్రామ కార్యక్రమానికి పిలవకపోవడంపై వేణుగోపాల్​రావు మంత్రి కేటీఆర్​కు, బీఆర్​ఎస్​ జిల్లా ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశాడు. అసలు తాను బీఆర్​ఎస్​ పార్టీలో ఉన్నానా… లేనా.. ఎందుకు గుర్తించడం లేదు..సర్పంచ్​ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నరంటూ వేణుగోపాల్​రావు తీవ్ర స్థాయితో ధ్వజమెత్తారు.దీంతో బీఆర్​ఎస్​ తంగళ్లపల్లి మండలాధ్యక్షులు గజభీంకార్​ రాజన్న కల్పించుకోని వేణుగోపాల్​రావును బుజ్జగించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్​ నాయకుడు చీటీ నర్సింగరావు కల్పించుకోని వేణుగోపాల్​ రావును సిరిసిల్ల తెలంగాణ భవన్​కు పిలిపించుకోని సమస్యను పరిష్కరించారు.చిక్కాల రామారావు తో మాట్లాడించి మరోసారి ఇలా కాదని, ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తామంటూ చెప్పించినట్లు తెలిసింది.

చిక్కాలది.. వలకొండది ఒక్కటే గ్రామం.. ఐన రాజకీయ వైరం

సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావు ది సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షులు వలకొండ వేణుగోపాల్​ రావుది కస్బె కట్కూర్​ గ్రామమే. వీరి మధ్య రాజకీయ వివాదం గత కొంత కాలంగా కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్​ మేనబావ చీటీ నర్సింగరావు సెస్​ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవ్వగా.. వేణుగోపాల్​ రావు, జూపల్లి వెంకట్రావ్​, రాజురావులు చీటీ నర్సింగరావుకు సపోర్ట్​ చేసి ప్రచారం నిర్వహించారు.దీంతో అప్పటి నుంచి వేణుగోపాల్​ రావును రాజకీయ శత్రువుగా చూస్తున్నట్లు సమాచారం. ఐన సెస్​ ఎన్నికల పోటీ నుంచి చీటీ నర్సింగరావు తప్పుకోని రామారావు గెలుపు కోసం కస్బె కట్కూర్​ నాయకులు వేణుగోపాల్​ రావు, వెంకట్రావ్​, రాజు రావులతో పని చేయించి చిక్కాల రామారావు గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల వరకు బాగానే ఉన్న చిక్కాల ఎన్నికల్లో గెలిచి..సిరిసిల్ల సెస్​ చైర్మన్​ గా పదవి బాధ్యతలు స్వీకరించగానే మనసు మార్చుకున్నాడు. తనకు పడని వారిని దూరం పెడుతూ.. తనకు అనుకూలంగా ఉన్నవారికి మండలంలో రాజకీయ ప్రాముఖ్యతను కల్పిస్తున్నారు. జిల్లా స్థాయి నాయకుడైన చిక్కాల గ్రామ రాజకీయాల్లో తలదర్చడంతో మండలంలో రాజకీయ తలనొప్పులు వస్తున్నాయి. బీఆర్​ఎస్​ పార్టీకి నష్టం కలుగుతుందని పలువురు బీఆర్​ఎస్​ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికల వేళ ప్రజాప్రతినిధులతో గొడవలు పెట్టుకుంటే నష్టం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైన సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావుతో మంత్రి కేటీఆర్​ కు రాజకీయ చిక్కులు ఏర్పడేలా ఉన్నాయని రాజకీయంగా చర్చ కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here