బలగం టివి:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని,జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు,సిబ్బందికి క్షేత్రస్థాయిలో 24/7 అందుబాటులో ఉండి మరియు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి,రూట్ మొబైల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సూచనలు ఇస్తూ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగుసేలా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది
పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు.
సీసీటీవీ లు, కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలతో మూడు అంచెల భద్రత మధ్య నిరంతరం గస్తీలో ఈవీఎం స్ట్రాంగ్ రుమ్స్..
జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ నియెజకవర్గ లలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అట్టి ఈవీఎంలు జిల్లా ,కేంద్ర బలగాలతో బద్దెనపల్లి లోని స్ట్రాంగ్ రూమ్ తరలించడం జరుగుతుందని,తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వేరు వేరుగా ఏర్పాటు చేసిన సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత భద్రపరిచే ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జిల్లా ,కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వృద్దులకు సహాయంగా నిలిచిన పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.