*నిర్మించిన నెలలోనే కూలిన వైనం.
- ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు.
బలగం టివి, ప్రతినిధి ముస్తాబాద్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ఎస్సి కాలనీలో నూతనంగా నిర్మించిన మురికి కాలువ నెల వ్యవధిలోనే కూలిన వైనం.నాణ్యతలేని నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్ మాట్లాడుతూ రెండు పడకల ఇండ్ల సముదాయం నుండి పాత ఇందిరమ్మ కాలనీ వరకు పైపులైను వేసి ఇక్కడ నుండి ముస్తాబాద్ సిరిసిల్ల ప్రధాన రహదారి వద్ద వరకు సిమెంటుతో మురికి కాలువ నిర్మించారని పేర్కొన్నారు.ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేవలం బూస సిమెంట్ మాత్రమే కలిపి కనీసం ఒక్క సలకా కూడా వేయకుండా మురికి కాలువ నిర్మించారని బేస్ పక్కన గుంతలలో పోసిన మట్టికే కూలిపోవడం బాధాకరని వెల్లడించారు.ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ అలాగే ఎలాంటి నాణ్యతను పరిశీలించని ఏఈపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.