సిరిసిల్ల న్యూస్:
40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు,అత్యవసర సర్వీస్ లకి ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనేలా చూడాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ మీటింగ్ హల్ లో
పోస్టల్ బ్యాలెట్ అంశం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు,భారత ఎన్నికల కమిషన్ గుర్తించిన 13 రకాల అత్యవసర సేవలు రంగాలకు చెందిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, అత్యవసర సర్వీస్ లకి ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు వీలుగా ఫారం-12D లు సంబంధిత శాఖల అధికారులు అందజేయడం జరిగిందన్నారు.
40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిందన్నారు.
ఈ నెల 24,25,26 తేదీలలో 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్ల ఇంటి వద్దకే వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామని చెప్పారు.
అత్యవసర సేవలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు ఆసక్తి చూపి నోడల్ అధికారికి లేదా సంబంధిత శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పూర్తి వివరాలతో నింపిన ఫారం – 12D ని ఈ నెల 7 వ తేదీలోగా అందిస్తే అదే రోజు సాయంత్రం
ఆ వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం రిటర్నింగ్ అధికారి దరఖాస్తులోని వివరాలను ఓటర్ జాబితాలోని వివరాలతో సరిపోల్చిన తర్వాత అర్హత గల ఓటర్ల జాబితాలను తయారు చేస్తారనీ, వారు సంబంధిత నియోజకవర్గం పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్ లలో మూడు రోజులలో నిర్ధారించిన సమయంలో, వారికి అనుకూలమైన రోజు ఓటు వేయాల్సి ఉంటుందన్నారు.