బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఖమ్మంలో ఫిబ్రవరి 11,12 తేదీలలో నిర్వహించే టి పి టి ఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ ముస్తాబాద్ మండల అధ్యక్షుదు ఎల్లారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుదు హనుమంత రెడ్డి, ప్రధాన టి పి టి రాష్ట్ర సీనియర్ నాయకులు వి చంద్రం ప్రధాన కార్యదర్శి మధుసూదన్ పిలుపునిచ్చారు.మహాసభలకు సంబంధించిన పోస్టర్ సోమవారం జిల్లా పరిషత్ పాఠశాల ముస్తాబాద్ లో వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ రాజు రెడ్డి హెడ్మాస్టర్ రవీందర్ ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, రాజు రెడ్డి ,రాజ మహమ్మద్, శంకరయ్య, వీరస్వామి,మహిళా ఉపాధ్యాయులు రమణ,జోష్ణ,శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.