జెగ్గరావుపల్లె 9వ వార్డులో కరెంటు పోలు సమస్య పరిష్కారం..

0
128

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

  • కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్‌

గత కొన్ని రోజులుగా జెగ్గరావుపల్లె 9వ వార్డులోని అంజయ్య ఇంటి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న కరెంటు పోలు స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం అంజయ్య కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు అధ్యక్షులు గంభీరవుపేట ప్రశాంత్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రశాంత్ గౌడ్, సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి, త్వరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. సెస్ సిబ్బందితో సమన్వయం చేసి, రెండు కొత్త కరెంటు పోలులు ఏర్పాటు చేయించారు. దీంతో గత కొంత కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రశాంత్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here