మండల వ్యవసాయ అధికారిని ప్రణీత
బలగం టివి, బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (పి.ఎం.కిసాన్) పథకంలో లబ్ధిదారులు రైతులందరూ ఈ.కె.వై.సి తప్పనిసరిగా చేసుకోవాలని అలాగే బ్యాంక్ అకౌంట్ ని ఆధార్ మపింగ్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని ప్రణీత అన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని ప్రణీత మాట్లాడుతూ: మండలంలో ఇంకా ఆధార్ కార్డు మపింగ్ చేసుకోని వారు 222, ఈ.కె.వై.సి చేసుకోని వారు 96 మంది రైతులు ఉన్నారన్నారు.దీని కారణంగా రైతులు కొన్ని విడతలు లబ్ధి పొందలేదని,అట్టి వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతోందని ఆన్నారు.16వ తేదీన కొదురుపాక రైతు వేదికలో కొదురుపాక,కొత్తపేట, మల్లాపూర్,మానువాడ, నర్శింగాపూర్, నీలోజిపల్లి,వెంకట్రావుపల్లి,19వ తేదీన బోయినిపల్లి రైతువేదికలో బోయినిపల్లి, బూరుగుపల్లి, మల్కాపూర్,తడగొండ, అనంతపల్లి,రామన్నపేట,20వ తేదీన కొరెం రైతు వేదికలో కోరెం,వరదవెల్లి, దుంద్రపల్లి,స్తంబంపల్లి,గుండన్నపల్లి, 21వ తేదీన విలాసాగర్ రైతు వేదికలో విలాసాగర్,దేశాయిపల్లి,జగ్గరావుపల్లి, మర్లపేట,రత్నంపేట గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించు కావాలని తెలిపారు.