బలగం టీవి , రాజన్న సిరిసిల్ల
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో స్పందించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్లు పి. గౌతమి, ఎన్. ఖీమ్యా నాయక్ లు ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 12 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులకు స్పందించి ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు.
కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూధన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు ఇవే!
Revenue – 4
DPO – 2
Survey – 1
Employment Office – 1
DRDO – 1
SDC – 1
DMHO – 1
Agriculture Office – 1
TOTAL – 12
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్లచే జారీ చేయనైనది
