బలగం టివి, సిరిసిల్ల
- అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు*
ప్రజావాణికి 37 దరఖాస్తులు వచ్చాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, పూజారి గౌతమి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రెవెన్యూ శాఖకు 20, సర్వే శాఖకు 3, డీ ఎంహెచ్ఓ, సిరిసిల్ల మున్సిపల్, డీపీఓ కార్యాలయాలకు రెండు చొప్పున, డీసీఎస్ఓ, డీఆర్డీఓ, తంగళ్ళపల్లి ఎంపీడీవో, ఎస్పీ, ఏరియా ఆస్పత్రి, ఉపాధి కల్పన, విద్య శాఖకు, మిషన్ భగీరథ వారికి ఒకటి చొప్పున దరఖాస్తు వచ్చాయి.

ప్రజావాణి లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధుసూదన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
IDOC క్షేత్ర పరిశీలనకు ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) క్షేత్ర పరిశీలనకు వచ్చారు. IDOC లోని అన్ని కార్యాలయాలను సందర్శించి, కార్యకలాపాలను విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్ ను కలిశారు.