బోయినిపల్లి:చొప్పదండి నియోజకవర్గం:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కోనరావుపేట మండల రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఉన్న పలు సమస్యలపై ఎస్.రామకృష్ణ (సి.జి.ఆర్.ఎఫ్-2 మెంబర్ టెక్నికల్)కు అక్కనపల్లి కరుణాకర్ వినతి పత్రం అందజేశారు.
అక్కనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ: స్తంభంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో 33కె.వి లైన్ గృహ నివాసాల మధ్యలో ఉన్నందున తొలగించాలని,నూతనంగా నిర్మించిన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పై ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని,స్తంభంపల్లి గ్రామంలో చంద్రగిరి రామయ్యపల్లిలో నూతనంగా విద్యుత్ వీధి దీపాల స్తంభాలు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని,వివిధ విష పూరిత కీటకాల నుండి ప్రమాదము ఉన్నందున వారికి వెంటనే వీధి వీధినా వీధి దీపాల స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.