ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.

0
51

బలగం టీవీ, విశాఖపట్నం:

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాలు గార్డు ఆఫ్ ఆనర్ నిర్వహించాయి.

విశాఖలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమానికి దేశ విదేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరుకానున్నారు. సముద్ర రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించే ఈ మహత్తర కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here