బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాయలసీమ తరహా గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని తన అనుచరులకు నేర్పుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి తీరును పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహా రెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి లు హేయమైన చర్యగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధతను ప్రజల్లోకి తీసుకపోతున్న దళితబిడ్డ సర్పంచ్ ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మాట్ల మధును ఫోన్ ద్వారా బెదిరింపు, వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ ల ద్వారా టార్గెట్ చేపిస్తున్న KK మహేందర్ రెడ్డి తీరును ఖండించడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలైనా నియోజకవర్గానికి రూపాయి తీసుకవచ్చి అభివృద్ధి పరచడం చేతగాని మహేందర్ రెడ్డి ఒక్కో మండలానికి పది మందిని తన అనుచరగణంతో కేటీఆర్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టిపిస్తున్నటు వంటి తీరు, బీఆర్ఎస్ నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బెదిరింపులకు గురి చేసినటువంటి తీరు సిరిసిల్ల ప్రజలు చూస్తున్నారని రాయలసీమ గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని తన అనుచరగణంతో సిరిసిల్ల నియోజకవర్గంలో చూపిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, సామాజిక మాధ్యమాలలో మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఇష్టం వచ్చినట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ గారిపైన అసభ్య పదజాలాన్ని వాడుతున్న తీరు హేయమైనదని అన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపై రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయాన కూడా వాట్స్ అప్ గ్రూపుల్లో వ్యక్తిగత దూషణలు చేయడాని గ్రూపుల్లో ఉన్న యువత, ప్రజలు కూడా సహించడం లేదని, దయచేసి పోలీసు అధికారులు ఇలాంటి వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముక్క మల్లయ్య, బండి ఎల్లం, ఎండి.జహంగీర్, పల్లె సత్యం, పుల్లూరి శ్రీనివాస్, చిప్పలపల్లి ఆంజనేయులు, బాలచంద్రం, సంజీవ్, తుమ్మనపల్లి శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.