బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
కేటీఆర్ పైన నోటికచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని కేకే. మహేందర్ రెడ్డిని హెచ్చరించిన నాయకులు
నిన్న సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే.మహేందర్ రెడ్డి తీరును కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, BRS పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, సీనియర్ నాయకులు బండి ఎల్లం తీవ్రంగా ఖండించారు. మరొక్కసారి ఇలా నోటికొచ్చినట్లు అహంకారంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 మాసాలైనా నియోజకవర్గానికి రూపాయి తీసుకురాని మహేందర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కేటీఆర్ పైన ఇష్టమచ్చినట్టు మాట్లాడిన మాటలను సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు చూస్తున్నారని, కేటీఆర్ నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తిని నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని, కేటీఆర్ తెలంగాణ ప్రజలు మెచ్చిన నాయకుడైతే, మీరు నియోజకవర్గ ప్రజలు తిరస్కరించిన నాయకుడని అన్నారు. దావోస్ పర్యటనలో కేటీఆర్ ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మంత్రిని అడిగి అవగాహన తెచ్చుకోమని హితబోధ చేశారు. ఏ అంశంపైన సరిగ్గా అవగాహన లేని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ ఊరుకుండేది లేదని, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కంచం నర్సింలు,కేటీఆర్ సేన మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, ఎండి.జహంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, పుల్లూరి శ్రీనివాస్, సుంచు రాజు, లోకం శ్రీను, అశోక్, సంజీవ్, సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.