బలగం టీవీ, హైదరాబాద్:
బీ ఆర్ టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ..
ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి రేవంత్ ప్రభుత్వమే కారణం, ఇలాంటి టన్నెల్ పనులు జరిగేటప్పుడు కార్మికుల కోసం అనేక భద్రతా చర్యలు తీసుకోవాలి. కార్మికులకు కనీసం ఆక్సిజన్ అందేలా కూడా అక్కడ చర్యలు చేపట్టలేదు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్మికుల సంక్షేమం పట్టడం లేదు. చాలా మంది కార్మికులు సరైన వేతనాలు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసంఘటిత కార్మికుల పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. కార్మిక విభాగం అధికారులు అసలు పని చేయడం లేదు. ఆటో కార్మికులకు సాలీనా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో లో చెప్పి చేయడం లేదు. వెంటనే కార్మికుల సంక్షేమం గురించి చర్యలు చేపట్టాలి. ఎస్ ఎల్ బి సీ టన్నెల్ ఘటన నేపథ్యం లో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ నారాయణ మాట్లాడుతూ..
సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. కార్మిక శాఖకు మంత్రి లేక పోవడం దురదృష్టకరం, రేవంత్ రెడ్డి వెంటనే కార్మిక శాఖ ను వేరే వాళ్లకు అప్పగించాలి. కార్మికులకు ఎన్నో నెలలు గడుస్తున్నా జీతాలు చాలా సంస్థల్లో రావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
బీ ఆర్ టీ యూ ప్రధాన కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ..
కేసీఆర్ హాయం లో కార్మికుల సమస్యల పట్ల సానుకూల దృక్పధం ఉండేది. రేవంత్ రెడ్డి కి కార్మికులంటేనే చిన్న చూపు, రేవంత్ నిర్లక్ష్యం తోనే టన్నెల్ లో కార్మికులు మరణించారు. కార్మికులకు భద్రతా చర్యలు కల్పించడం లో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. తక్షణమే కార్మిక శాఖ కు ఫుల్ టైం మంత్రిని నియమించాలి.