బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
BRS పని అయిపోయింది అన్న బండి సంజయ్ వాక్యాలపై BRS సిరిసిల్ల టౌన్ యూత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా టౌన్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు లో ఒక సామెత ఉంది ఎ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని ఈ MLC ఎన్నికల ఫలితాలు చుస్తే అలాగే అనిపిస్తుందని కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత వల్ల , BRS పార్టీ పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ కి ఓట్లు పడ్డాయి తప్పించి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసారని ఓట్లు పడలేదని నిన్నటి నుండి అన్ని చానెల్స్ లో స్క్రోలింగ్స్ బండి సంజయ్ వ్యూహాలు, కిషన్ రెడ్డి సారధ్యం అని వ్యూహాలు లేవని సారధ్యాలు లేవని ఓటర్ లకి ఆప్షన్ లేదని BRS పని అయిపోయిందని బండి సంజయ్ అంటున్నారని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కదిలే మేఘాల లాంటివి వస్తుంటాయి పోతుంటాయని కానీ BRS పార్టీ ఆకాశం లాంటిది ఇలాంటి మేఘాలను ఉరుములను మెరుపులను పిడుగులను ఎన్నో చూసిందని, రెండు లక్షల మెజారిటీ ఇచ్చి కూడా కరీంనగర్ పార్లమెంట్ కి బండి సంజయ్ రెండు లక్షల నిధులు కూడా తేలేదని, బండి సంజయ్ ని, ప్రధానమంత్రిని చేసిన కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకి ఒరిగేది సున్నానే అని,తెలంగాణ లో బీజేపీకి 8 పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా ఏ మాత్రం నిధులు తీసుకురాని అసమర్ధత కలిగిన నాయకత్వం తెలంగాణ బీజేపీ పార్టీది ప్రజలు ఒక్క విషయం ఆలోచించండి మనము ఓటు వేసి గెలిపించిన నాయకుడి వల్ల లాభం జరుగుతుంద లేదా పని చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.