రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

బలగం టీవి ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి… -వాహనదారుల ప్రాణాలు కాపాడడమే ప్రదానం -డీఆర్ఎస్ సీ సమావేశంలో చైర్మన్, కలెక్టర్ అనురాగ్ జయంతి… : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రదాన లక్ష్యమని డీఆర్ఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా అనురాగ్ జయంతి మాట్లాడాతూ రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని ప్రదాన మార్గాల్లో వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్, స్ట్రిప్స్, ఎంత వేగంతో వెళ్ళాలో సూచించే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని,వీటిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. సైన్ బోర్డ్లు, వేగాన్ని సూచించే బోర్డు లు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా దాతలు ఉంటే సంప్రదించాలని ఆర్ అండ్ బీ అధికారులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు. ప్రస్తుత జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ‘సీపీఆర్’ పై జిల్లాలోని గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, టీచర్స్, పంచాయతీ కార్యదర్శి, రోడ్డు భద్రతా క్లబ్ సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను సూచించారు. సదస్సుల నిర్వహణ కు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్డు భద్రత చర్యల పర్యవేక్షణకు జిల్లా రవాణా అధికారి కొండల్ రావు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడాతూ నిత్యం సంభవించే మరణాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారు ఉంటున్నారని అన్నారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగిన స్థలానికి ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, రవాణా, పోలీస్ శాఖ అధికారులు కలిసి వెళ్లాలని, అక్కడ ప్రమాదం ఎందుకు జరిగిందో విశ్లేషించాలి లని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రోడ్డు ప్రమాదాలు పొంచి ఉండే స్థలాల్లో రోడ్డు స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 13 ‘బ్లాక్ స్పాట్’ లను వివిధ శాఖల అధికారులతో కలిసి మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు లైసెన్స్ లు ఇప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ వాహనదారుడు తప్పకుండా లైసెన్స్, వాహనానికి బీమా ఉండేలా చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, డీపీఓ రవీందర్, ఆర్ అండ్ బీ ఈఈ శ్యాంసుందర్, పంచాయతీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డిస్ట్రిక్ట్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ,సెస్ ఎండీ సూర్యచంద్ర రావు,సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లు అయాజ్, అన్వేష్, వేములవాడ రాజన్న ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడడమే ప్రదాన లక్ష్యమని డీఆర్ఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా అనురాగ్ జయంతి మాట్లాడాతూ రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని ప్రదాన మార్గాల్లో వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్, స్ట్రిప్స్, ఎంత వేగంతో వెళ్ళాలో సూచించే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని,వీటిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. సైన్ బోర్డ్లు, వేగాన్ని సూచించే బోర్డు లు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా దాతలు ఉంటే సంప్రదించాలని ఆర్ అండ్ బీ అధికారులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు. ప్రస్తుత జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ‘సీపీఆర్’ పై జిల్లాలోని గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, టీచర్స్, పంచాయతీ కార్యదర్శి, రోడ్డు భద్రతా క్లబ్ సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను సూచించారు. సదస్సుల నిర్వహణ కు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్డు భద్రత చర్యల పర్యవేక్షణకు జిల్లా రవాణా అధికారి కొండల్ రావు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడాతూ నిత్యం సంభవించే మరణాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారు ఉంటున్నారని అన్నారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగిన స్థలానికి ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, రవాణా, పోలీస్ శాఖ అధికారులు కలిసి వెళ్లాలని, అక్కడ ప్రమాదం ఎందుకు జరిగిందో విశ్లేషించాలి లని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రోడ్డు ప్రమాదాలు పొంచి ఉండే స్థలాల్లో రోడ్డు స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 13 ‘బ్లాక్ స్పాట్’ లను వివిధ శాఖల అధికారులతో కలిసి మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు లైసెన్స్ లు ఇప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ వాహనదారుడు తప్పకుండా లైసెన్స్, వాహనానికి బీమా ఉండేలా చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, డీపీఓ రవీందర్, ఆర్ అండ్ బీ ఈఈ శ్యాంసుందర్, పంచాయతీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డిస్ట్రిక్ట్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ,సెస్ ఎండీ సూర్యచంద్ర రావు,సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లు అయాజ్, అన్వేష్, వేములవాడ రాజన్న ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş