రంగోత్సవంలో రన్నించిన విద్యార్థులకు బహుమతులు అందజేత..

0
33

జాతీయ స్థాయి మొదటి బహుమతి పొందిన ఏంజిల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థి గత నెలలో జరిగిన రంగోత్సవంలో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ డానియల్- సంతోషి కూతురు ఏంజిల్ ఎనిమిదవ తరగతి చదువుతుంది, జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలలో మొదటి బహుమతి గెలుపొందింది. మొదటి బహుమతి పొందిన విద్యార్థి ఏంజెల్ ను పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు.

ఏంజెల్ తో పాటు కులేరి జెస్సికా స్వీటీ, కొత్త రక్షన్,అలెక్స, కౌశిక్, శ్రీవల్లి, సానియా, రిత్విక్, అద్వైత, ఆరాధ్య, మొత్తం 28 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్, సిల్వర్ మోడల్, బ్రాంజ్ మెడల్, షీల్డ్, మేమెంటో, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శరత్ కుమార్, సంతోష్ కుమార్ డైరెక్టర్లు నయీమా, అష్రఫ్, హమీద ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here