భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్.
బలగం టివి,సిరిసిల్ల:
మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ పని చేస్తున్నదనీ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
శుక్రవారం రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని శ్రీనగర్ కాలనిలో మహిళలు,చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ
వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పోక్సో మరియు అత్యాచార కేసులలో భాదిత మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు ద్వారా భరోసా సెంటర్ ద్వార షెల్టర్ కల్పించడం జరుగుతుందన్నారు. పోలీసు స్టేషన్లో కేసు నమోదు మొదలుకొని, చివరివరకు బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని వేదింపులు, ఆత్యాచార బాధిత మహిళలకు, పిల్లకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీసు మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది అని అన్నారు.మహిళలు మరియు పిల్లల పై జరిగే నేరాలను ,హింసను తగ్గించడమే ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం అని కావున మహిళలు,యువతులు,బాలికలకు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సిఐ రఘుపతి, ఆర్ఐ యాదగిరి, భరోసా సెంటర్ రిసేపనిస్ట్ మల్లీశ్వరి,సపోర్ట్ పర్సన్ అనంత, షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.