బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఈ రోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ల యొక్క రిజల్ట్, ప్రభుత్వం వర్గీకరణ చట్టం పూర్తి అయ్యేవరకు ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకూడదని నిరసిస్తూ నిరసన దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాట్ల శంకర్, అధ్యక్షులు మల్యాల లక్ష్మణ్, మండల అధికార ప్రతినిధి గుండు ప్రేమ కుమార్, మండల ఉపాధ్యక్షులు చదల రాకేష్, మండల కార్యదర్శి మహంకాళి రవి, మల్యాల దేవయ్య, బోయిని రాజశేఖర్, కురుమ బాలయ్య, సావనపల్లి రాజశేఖర్, మునిగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.