మత్స్యకారులకు ప్రమాద బీమా అందజేత..

0
62

ఇద్దరికి రూ. ఐదు లక్షల చొప్పున ధృవీకరణ పత్రాలు పంపిణీ చేసిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద గ్రూప్ ప్రమాద బీమా పత్రాలను పలువురికి ధృవీకరణ పత్రాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం అందజేశారు.

కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామానికి చెందిన కూన తిరుపతి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో అతడి భార్య కూన లావణ్యకు, అలాగే గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన కుంట రమేష్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో అతడి తల్లి కుంట మల్లవ్వ బ్యాంక్ ఖాతాల్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద గ్రూప్ ప్రమాద బీమా కింద రూ. ఐదు లక్షల చొప్పున ఇద్దరికి జమ అయ్యాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద గ్రూప్ ప్రమాద బీమా పలువురికి ధృవీకరణ పత్రాలను ఇంచార్జి కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు మామిండ్ల అంజయ్య, చింతకింది పోచయ్య, కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here