ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ద్యేయం..

0
102

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

రుద్రoగి లో పలు అభివృద్ధి పనులను ప్ర ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే..

బలగం టివి ,,రుద్రంగి :

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో పల్లె దవాఖానాలు, షెడ్యూలు కులాల బాలుర వసతి గృహంలో డైనింగ్ హాల్ లైబ్రరీ ల్యాబ్ లను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంతో పాటు వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు.. ప్రజలందరూ పల్లె దవాఖానాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. దశలవారీగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు.. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు.. హైదరాబాదులో నిన్నటి రోజు కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదలకు హామీ ఇచ్చారని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి అని అన్నారు.. ఈ నెల 31 తో పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిస్తున్నందున గ్రామ పంచాయితీ పాలకవర్గంతో పాటు పంచాయతీ సిబ్బందిని సత్కరించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గంగం స్వరూప రాణి ,జడ్పిటిసి గట్ల మీనయ్య,సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం,సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్, ఎంపీటీసీ లు, వార్డు మెంబర్లు ,ప్రజా ప్రతినిధులు ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here