- ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజున విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు.
ఈ నెల 11 న మొదటి విడత, 14 న రెండవ విడత, 17 న మూడవ విడత ఎన్నికల నిర్వహణ ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజు జిల్లాలోని విద్యాసంస్థలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం 10.12.2025(బుధవారం) & 11.12.2025 (గురువారం) స్థానిక సెలవులు, రెండవ విడత ఎన్నికల నిర్వహణ కోసం 13.12.2025 (రెండవ శనివారం), 14.12.2025 (ఆదివారం) సాధారణ సెలవులు, మూడవ విడత ఎన్నికల నిర్వహణ కోసం 16.12.2025 (మంగళవారం) & 17.12.2025 (బుధవారం) స్థానిక సెలవులు ప్రకటించారు. చట్ట ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున సెలవు వర్తిస్తుందని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.
