జోరుగా బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయండి
స్థానికుడు,సౌమ్యుడు బిఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్
పలు గ్రామలలో ఇంటింటికి వెల్లి ఓటర్లతో మాట్లాడిన వినోద్ కుమార్
సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ పాదయాత్ర నిర్వహించి,ఇంటింటికి వెల్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి, కొత్తపేట, మానువాడ,మల్లాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆదివారం కొత్తపేట గ్రామంలో గడపగడపకూ ప్రచారం నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో వినోద్ కుమార్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన,చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వినోద్ కుమార్ వివరించారు.

రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం,దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని వినోద్ కుమార్ అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ మాట్లాడుతూ: కాంగ్రెస్, బీజేపీ లు తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాయని,
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని,అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా మేనిఫెస్టో ఉందని,అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని కోరారు.
స్థానిక నియోజకవర్గ బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్,సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.