బలగం టీవీ, గంభీరావుపేట :
విద్యుత్ సమస్యలను ఎప్పటిక ప్పుడు పరిష్కరిస్తూ వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ ను సెస్ సంస్థ అందిస్తున్నదని నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని సెస్ డైరెక్టర్ నారాయణరావుతో కలిసి రవీందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తాననీ, ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి రావాలన్నారు. వినియోదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించినట్లయితే సెస్ అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంజి రెడ్డి నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.