మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి.

0
72

– సిరిసిల్ల మహాత్మాజ్యోతి బా ఫులే విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ.

  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే విద్యాలయంలో ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా విద్యాలయంలో 6వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపు ఇచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here