–ప్రభుత్వ భూముల పై సమగ్ర నివేదిక ఇవ్వాలి..
– కలెక్టర్ అనురాగ్ జయంతి
బలగం టివి,సిరిసిల్ల:
———————————————————-
——————————————————–నాణ్యమైన ఓటరు జాబితాయే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శని వారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓటరు జాబితాలోని సవరణలు, మీ సేవ అప్లికేషన్లు పెండింగ్, కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల వివరాల పై జిల్లాలోని ఆర్డిఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
ఈ సందర్బంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్, పుట్టిన తేదీ తప్పుగా పడిన వారి వివరాలను క్షేత్రస్థాయిలోపరిశీలించి, ఫామ్ -7 తీసుకొని సవరణలు చేయాలని, వాటిని ఆన్లైన్లో ఈ నెల 15 వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో నాణ్యమైన సమాచారం ఉండడమే తమ లక్ష్యమని అన్నారు. అనంతరం కులం, ఆదాయం, ఇతర సర్టిఫికేట్ ల జారీలో జాప్యం చేయవద్దని ,ఎప్పటికప్పుడు వాటిని జారీ చేయాలని పేర్కొన్నారు. ఆర్ డి ఓ కార్యాలయాల్లో పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో సరైన వివరాలు ఉన్న వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పై
నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కోర్టు కేసుల విషయమై చర్చించారు. దీనిపై ముస్తాబాద్ తహసీల్దార్ సమాచారం ఇవ్వకపోవడంతో మందలించారు. పూర్తి వివరాలతో కలవాలని పేర్కొన్నారు.. వీర్న పల్లి మండలంలో ప్రభుత్వ వివరాలను తహసీల్దార్ ఇవ్వడంతో తహసీల్దార్ అభినందించారు. మిగితా తహసీల్దార్లు అందరూ ఆయా శాఖల పరిధిలోని భూముల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఎస్ డీ సీ గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి, పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.