ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయం..

0
48
  • డీఎస్పీ నాగేంద్రచారి

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థం సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో బాటసారుల దాహం తీర్చడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. సామాజిక బాధ్యతతో మార్కండేయ ఫార్మసీ వారు చేస్తున్న ఈ సేవలు ప్రశంసనీయమని, ఇలాంటి మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయపడాలని ఆకాంక్షించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మార్కండేయ ఫార్మసీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here