ముఖ్య అతిధిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రభుత్వ విప్
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ముదిరాజ్ మత్స్యకార సంఘం వారి ఆధ్వర్యంలో
(మిడ్ మానేరు) శ్రీరాజరాజేశ్వరీ జలాశయంలో
నిర్వహించిన తేప్పల పోటీలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించారు..

పోటీలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రావరం గ్రామ ప్రజలకు,ముదిరాజ్ కులస్తులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.సంక్రాంతి అంటేనే ఆంధ్ర పల్లెటూర్లో కోడిపందాలు,ఎద్దుల పోటీలు గుర్తుకొస్తాయని అయితే వాటిని మైమరిపించేలా అంతే హుషారుగా తెప్పల పోటీలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రవరం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ముదిరాజ్ కులస్తులను అభినందించారు..తెప్పల పోటీలను ఇతర రాష్ట్రాల్లో చూస్తుంటాం కానీ ఈ పోటీలను మన ప్రాంతంలో నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు.ఈ పోటీల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాషం,శారీరక దృఢత్వం లభిస్తుందని,విజయం సాధించిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు..
సొసైటీల ద్వారా
మత్స్యకారులకు రుణాలు మంజూరు చేస్తున్నామని కావున అందరూ వినియోగించుకోవాలని అన్నారు.. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు.. వచ్చే సంవత్సరం ఈ తేప్పల పోటీలను అందరం కలసి జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుందాం అన్నారు..
