బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీ ఆంక్ష రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు RTA మెంబర్ సంగీతం శ్రీనాథ్ (వింకు) ఆదేశాల మేరకు బర్త్డే వేడుకలను నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ నాయకుల వెల్లడించారు.
సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గం లోని తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో గల శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ నాయకులు వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిరుపతి, సుద్దాల శ్రీనివాస్, గణాధి కిషన్, పిషరిస్ జిల్లా జనరల్ కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, షారుక్, సుమంత్,, పరశురాం తదితరులు పాల్గొన్నారు
