సిరిసిల్ల న్యూస్: కలెక్టరేట్:
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నివేదికలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలకులకు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ అతిథి గృహాన్ని గురువారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులు జిల్లాకు రాబోతున్నారని, వారికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు సకాలంలో అందజేయాలని సూచించారు. అన్ని సూట్ లలో టివి, కంప్యూటర్ సిస్టమ్, గీజర్, ఫ్రిజ్, సరిపడా ఫర్నిచర్ ఉండేలా ఏర్పాట్లు చేశామని, ఇన్వర్టర్ సదుపాయం కల్పించామని తెలిపారు. వసతి గృహంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, రిటర్నింగ్ అధికారులు ఎన్.ఆనంద్ కుమార్, మధుసూధన్, నోడల్ అధికారులు సైదులు, కె.నర్సింహులు, ఎం.దశరథం, రవికుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.