బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా లో పలువురు ఎస్సైలను బదిలీలు చేస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు జారీ చేశారు. తంగళ్లపల్లి ఎస్సై వెంకటేశ్వర్లను చందుర్తి ఎస్సైగా.. చందుర్తి ఎస్సై ఆశోక్‌ను రుద్రంగికి, రుద్రంగి ఎస్సై రాజేశ్ ను జోన్ 3 కి సరెండర్ చేశారు.ఎస్‌బిలో ఉన్న ఎల్.శ్రీకాంత్‌ను బోయినిపల్లి ఎస్సైగా, కే.ప్రశాంత్ రెడ్డిని తంగళ్లపల్లి ఎస్సైగా ,గంభీరావుపేట ఎస్సై మహేశ్‌ను సిరిసిల్ల డీఎస్‌బికి, సిద్దిపేట కమీషనరేట్ పరిధిలో ఉన్న రాంమోహన్ ను గంభీరావుపేట ఎస్సైగా బదిలి చేశారు. వీర్నపల్లి ఎస్సై నవతను సిరిసిల్ల స్పెషల్ బ్రాంచ్‌కు, బోయినిపల్లి ఎస్సై మహేందర్‌ను జోన్ 3కి సరేండర్ చేశారు.వేములవాడ టౌన్ ఎస్సై రమేశ్‌ను వీర్నపల్లి ఎస్సైగా బదిలి చేశారు.
