రాజన్నసిరిసిల్ల . జిల్లా స్థాయి కబడ్డి సెలక్షన్స్‌‌ టోర్నమెంట్‌‌ ను ప్రారంభించిన మున్సిపల్‌‌ చైర్‌‌ పర్సన్‌‌ జిందం కళాచక్రపాణి

0
192

బలగం టీవి…

ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించడం జరిగింది ..
ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని కేవలం కబడ్డీ మీద ఆసక్తితో కాకుండా కబడ్డీ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపు కోసం ప్రతి ఒక క్రీడాకారులు ఇష్టంతో కష్టపడి ఆడాలని అన్నారు..
ఈ కబడ్డీ క్రీడాకారులను చూస్తే నా చిన్నతనం గుర్తుకు వస్తుందని అన్నారు.
అనంతరం క్రీడాకారులు అందరినీ పరిచయం చేసుకుని టాస్క్ వేసి కబడ్డీ క్రీడలు ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సభ్యులు గెంట్యా ల శ్రీనివాస్ గారు ,దేవులపల్లి ప్రభాకర్ గారు, బొడ్డు నారాయణ గారు, వంకాయల కార్తీక్ గారు, మరియు ఫిజికల్ డైరెక్టర్లు గారు, కబడ్డీ అభిమానులు మరియు కబడ్డీ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here