బలగం టివి:
- మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళా ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కలెక్టర్
సిరిసిల్ల 09, డిసెంబర్ 2023
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుతో పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
హైదరాబాద్ లో సిఎం శ్రీ రేవంత్ రెడ్డి
మహాలక్ష్మి, చేయూత పథకాలకు ప్రారంభించిన అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని సిరిసిల్లలో డా.బి ఆర్ అంబేద్కర్ కూడలి లో, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో శనివారం కలెక్టర్ అనురాగ్ జయంతి లాంఛనంగా ప్రారంభించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్‌ను , ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితి పెంపు అమలులోకి వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద
ఒక ఫ్యామిలీకి రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందించడానికి
ప్రభుత్వం తీసుకున్న ఇంపార్టెంట్ స్టెప్ తో ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు చికిత్సలు ఉచితంగా లభిస్తాయని చెప్పారు. ఈ రోజు సంతోషకరమైన రోజని జిల్లా కలెక్టర్ తెలిపారు .
ఈ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,73,974 పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు.
మహిళలకు పల్లె వెలుగు , ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం మంచి పథకమని … మహిళా సాధికారిత దోహదం చేస్తుందన్నారు.
ముఖ్యంగా పేద మహిళలకు ప్రయాణ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మహిళా ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో అంబేద్కర్ కూడలి నుండి రగుడు వరకు బస్సులో ప్రయాణించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి , జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు గారు, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు గారు, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో సిహెచ్ సంతోష్ గారు, జిల్లా ఆరోగ్యశ్రీ టీం లీడర్ తిరుపతి, సిరిసిల్ల డిపో మేనేజర్ ఎన్.మనోహర్, ట్రాఫిక్ ఇంచార్జి ఎల్.సారయ్య, మెకానికల్ ఇంచార్జి ఎకె.ఖాన్ , ప్రోగ్రాం ఆఫీసర్స్, డాక్టర్స్ , పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టూడెంట్స్ , ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి పథకం నిబంధనలివే..
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే..
1) తెలంగాణకు చెందిన మహిళ అయి ఉండాలి. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులు ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులు ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి.
2) అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయం వాడుకోవచ్చు.
3) తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
4) పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.
5) బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లగలరు, తరువాత టికెట్ కొనాలి.
6) ప్రయాణంలో కిలోమీటర్ల పరిధిపై ఎలాంటి పరిమితులు లేవు.
7) ప్రయాణించే ప్రతీ మహిళకు ‘జీరో టికెట్’ ఇస్తారు.
8) మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం ఛార్జీని ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి చెల్లిస్తుంది.
ఈ పథకం కింద మహిళలకు త్వరలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్’ అందించనుంది.