బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
భారీ సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలలో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రెండవ రోజు బీసీ కార్పొరేషన్ లకు నిర్వహించగా అధిక సంఖ్యలో యువతి, యువకులు పాల్గొన్నారు. ఎస్బిఐ విలాసాగర్, యూనియన్ బ్యాంక్ బోయినిపల్లి శాఖలకు సంబంధించిన గ్రామాలకు బీసీ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో నిరుపేద నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో జయశీల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాజీవ్ వికాసం పథకం ప్రవేశపెట్టిందని పథకానికి మొత్తం మండలంలోని 23 గ్రామాలకు గాను 1970 పైగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో మొదటి రోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీలకు ఇంటర్వ్యూ నిర్వహించామని, రెండో రోజు బీసీలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపు 900 కు పైగా నిరుద్యోగ యువతీ, యువకులు హాజరైనట్లు తెలిపారు. వీరిలో నుండి మంచి నైపుణ్యం కలిగిన నిరుద్యోగులను అలాగే బ్యాంక్ నియమ నిబంధనలకు లోబడి లబ్ధిదారులను గుర్తిస్తామని, గుర్తించిన లబ్ధిదారులకు లక్ష రూపాయల వారికి 15 రోజులు, రెండు లక్షల వారికి నెలరోజులు, నాలుగు లక్షల వారికి 45 రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపర్డెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బిఐ మేనేజర్ సురేందర్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.