ప్రశాంతంగా రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలు..

0
74

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలలో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. మొదటి రోజు ఎస్బిఐ విలాసాగర్, యూనియన్ బ్యాంక్ బోయినిపల్లి శాఖలకు సంబంధించిన గ్రామాల ఎస్సీ , ఎస్టీ, ఈ బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లకు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, ఈబిసి నిరుపేద నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఇంటర్వ్యూలకు వచ్చిన వారికి ఎంపీడీవో జయశీల అన్ని ఏర్పాట్లను చేసి అధిక సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. వివిధ వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న 730 మందిలో ఇంటర్వ్యూలకు 492 మందిహాజరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల తహశీల్దార్ నారాయణరెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపర్డెంట్ రవీందర్, ఐకెపి ఎపిఎం జయసుధ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బిఐ మేనేజర్ సురేందర్, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here