బలగం టీవీ, హైదరాబాద్ :
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఎన్జీవో కోశాధికారి, ఆబ్కారీ సూపరింటెండెంట్ రామినేని శ్రీనివాస్ అకాల మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోద్యమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా శ్రీనివాస్ అగ్రభాగాన ఉండి పోరుసల్పారని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు, శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.