కార్వింగ్ కళాకారుని ప్రతిభ
బలగం టీవి,, ఎల్లారెడ్డిపేట
రేపు అయోధ్యలో శ్రీ రాములవారి రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ, క్యారెట్ తో కలిపి శ్రీరామ మందిరం తయారుచేసి తన ప్రతిభను కలబర్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్ల తో కలిపి రామ మందిరం ను త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు 16 పొడవు,13ఇంచుల వెడల్పుతో నాలుగు గంటలు శ్రమించి రూపొందించినట్లు తెలిపారు.గతంలో వినాయక చవితి, శివరాత్రి, క్రిస్మస్ వేడుకల సందర్భంగా దేవుండ్ల ప్రతిమను అదేవిధంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, క్రీడాకారుడు విరాట్ కోహ్లీ, తదితర నాయకులను పుచ్చకాయపై కార్వింగ్ చేయడం చేసి ఆవిష్కరించాడు. తన ప్రతిభను గుర్తించి గత సంవత్సరం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు జాతీయ అవార్డును ప్రధానం చేశారు.
