ఆటో డ్రైవర్లకు ‘రామన్న’ ఆత్మీయ భరోసా, 25 మందికి హెల్త్, ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ…

0
54

బలగం టీవీ, ముస్తాబాద్:

ఆపదలో ఉన్న ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆవునూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో నిర్వహించిన “రామన్న ఆత్మీయ భరోసా” కార్యక్రమంలో భాగంగా శనివారం 25 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డ్స్ మరియు ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ఉపాధి కోల్పోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 93 మందికి పైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని ఆయన మండిపడ్డారు.

సిరిసిల్ల – ముస్తాబాద్ రూట్ ఆటో యూనియన్ అధ్యక్షులు కోటగిరి కనకయ్య మాట్లాడుతూ. గతంలో వీర్నపల్లి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో కేటీఆర్ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారని గుర్తు చేశారు.

కేటీఆర్ చొరవతో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇచ్చారని తెలిపారు. ఆటో డ్రైవర్ల ఆరోగ్య సమస్యల దృష్ట్యా, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు తమ సొంత దవాఖానలో ఉచిత చికిత్స కోసం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామ లక్ష్మణ పల్లె, తుర్కపల్లె, ఆవునూర్ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యూత్ సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here