బలగం టీవీ, గంభీరావుపేట:
అయోధ్య రాముడి పూజిత అక్షింతలను గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం సభ్యులు ఊరేగింపుగా వెళ్లి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్షింతలను దేవుని వద్ద ఉంచి కుటుంబసభ్యులపై చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాతూరి బాల్ రెడ్డి, మెతుకు బాబు, ఆంజనేయులు, మణిదీప్ రెడ్డి, జగదీశ్వర్, అనుప వెంకటేష్, కేశవచారి, శ్రీనివాస్ చారి, కాస దేవయ్య,సుల్తాన్ అంజి రెడ్డి, అరుణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.