బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని గుంట పెళ్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి గుగులోత్ రవి బతుకుదెరువు కోసం ఆరునెల క్రితం విజిట్ వీసా పై సౌదీ కి వెళ్లడం జరిగింది. శనివారం రోజు 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించాడు. ఈ సమాచారాన్ని గ్రామ మాజీ సర్పంచ్ మాలోపుణ్య నాయక్, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక -కిషన్ మరియు గ్రామస్తులు కేటీఆర్ కి సమాచారం అందించడం జరిగింది.. సౌదీ కి సంబంధించిన అధికారులతో మాట్లాడి త్వరలోనే మృతదేహాన్ని స్వస్థలానికి చేరడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానాని ఫోన్ ద్వారా తెలుపడం జరిగింది.
