మహిళలకు,చిన్నారులకు అండగా భరోసా కేంద్రాలు..

0
228

బాధితులకు తక్షణమే సూచనలు, సలహాలు, సహాయం అందించాలి.

భరోసా సెంటర్ కల్పిస్తున్న సేవలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించే వరకూ “భరోసా సెంటర్” అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనిలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గారు శుక్రవారం రోజున సందర్శించి లైంగిక,భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు,సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు,మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి,పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు. లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.భరోసా సెంటర్ సేవల గురించి జిల్లాలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించలని భరోసా సెంటర్ సిబ్బందికి సూచించారు.

ఎస్పీ వెంట డిసిర్బీ సి.ఐ నాగేశ్వరరావు, భరోసా కేంద్రం సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here