యాదాద్రి జిల్లాలో ఓటర్ల అపూర్వ చైతన్యం: రాష్ట్రంలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదు..
గ్రామంలో 98% పోలింగ్ నమోదు.. రాష్ట్రంలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదు చేసి రికార్డు
బలగం టీవీ, యాదాద్రి:
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం రికార్డు స్థాయికి చేరింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, జంగారెడ్డి గూడెం గ్రామం రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేసి వార్తల్లో నిలిచింది.
జంగారెడ్డి గూడెం గ్రామ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో అద్భుతమైన చైతన్యాన్ని ప్రదర్శించారు. ఈ గ్రామంలో ఏకంగా 98 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక శాతం పోలింగ్‌గా రికార్డు సృష్టించింది. ఈ అపూర్వ స్పందనతో ఆ గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది.
