స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి మండలాన్ని పట్టించుకోవట్లేదంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3 వ రోజుకు చేరిక
బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారించాలంటూ, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన మండలాన్ని సమస్యలను పట్టించుకోవట్లేదు అంటూ ప్రజా సమస్యల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా సామాజిక ఉద్యమకారుడు, ఎమ్ ఆర్ పి ఎస్ జిల్లా కో కన్వినర్ సావనపల్లి రాకేష్ మాట్లాడుతూ మండల సమస్యలపై ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారంలోకి వచ్చాక పట్టింపే కరువైందన్నారు. మండలంలో వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రోడ్లకు మరమ్మత్తులు, మండల స్థాయి క్రీడా మైదానం, అసంపూర్తిగా ఉన్న అనంతారం బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
