- తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేత.
- పంటలను కాపాడాలని రైతుల విజ్ఞప్తి.
ముద్ర ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్,గన్నేవారిపల్లె గ్రామాల రైతులు తాహసిల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ పోతుగల్, గన్నేవారిపల్లి,లచ్చపేట గ్రామాల రైతులు ఎల్లమ్మ వాగు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలం ముస్తాబాద్ పెద్ద చెరువు నిండి అలుగు పారితే నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.కాని యాసంగి పంటకు వేసవికాలం కావడం బావులు,బోరు బావులు నిరంతరం నడవడం వలన వాగు ఎండిపోవడం భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి ఎద్దడి ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వాగు నీటిపై ఆధారపడి రైతులు దాదాపు వెయ్యి ఎకరాల సాగు చేస్తారని వెల్లడించారు.ప్రస్తుతం వాగు పూర్తిగా ఎండిపోవడంతో పంట పొలాలు కూడా ఎండుతున్నాయని,అధిక పెట్టుబడి పెట్టి పంటలు వేస్తే వాతావరణ మార్పులతో వరికి తెగుళ్లు సోకడంతో రసాయన ఎరువులను పిచికారీ చేస్తూ రైతులు ఆర్థిక భారంతో అప్పుల పాలవుతున్నారని,దానికి తోడు నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను ముస్తాబాద్ పెద్ద చెరువులో నింపి నీటిని విడుదల చేసేవారని తెలిపారు.ఇప్పుడు కూడా చెరువులోకి నీళ్లు వస్తుండడంతో సాగునీటిని విడుదల చేయాలని తహసిల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశామని తెలియజేశారు. తహసిల్దార్ సురేష్ రైతుల వినతి మేరకు ఇరిగేషన్ డి ఈ తో మాట్లాడి నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేశం,హన్మంత్,రఘు,బాల్ నర్సయ్య,శ్రీనివాస్,ఎల్లయ్య, లక్ష్మయ్య, అంజయ్య మూడు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.