- హర్షం వ్యక్తం చేసిన రైతులు.
- పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
బలగం టివి ,, ముస్తాబాద్
ముస్తాబాద్ మండలానికి యాసంగికి. పంటకు సాగునీరు విడుదల చేయడంతో మద్దికుంట గ్రామంలోని సాగునీటి కాలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి నీటిలో పూలు చల్లిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి,పార్టీ నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువ మానెరు పరివాహక ప్రాంతాలకి నీరు అందించేందుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మా ప్రాంత రైతులకు యాసంగి పంటకు నీరు ఇవ్వాలని చెప్పడంతో మంత్రి ప్రత్యేక చొరవతో మల్లన్న సాగర్ లోనీ నీటిని విడుదల చేయించారని పేర్కొన్నారు.ఇది మాకు రైతుల పట్ల ఉన్న విశ్వాసమని మండల రైతుల తరపున మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు నీళ్లు రావు అంటూ బీఆర్ఎస్ నాయకులు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెల్లడిస్తూ ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గజ్జల రాజు,మహేందర్ రెడ్డి ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింలు ప్యాక్స్ డైరెక్టర్ దేవయ్య సీనియర్ నాయకులు బాల్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్, ఆంజనేయులు,సత్యంగౌడ్,భాను తదితరులు పాల్గొన్నారు.