బలగం టీవీ, హైదరాబాద్ :
మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారంటూ ఇరిగేషన్ శాఖ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ, మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని తెలిపారు. రాజకీయ కక్ష్యల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే, డ్రోన్ ఎగురవేయడం డ్యామ్ భద్రతకు ప్రమాదకరమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఇరువైపులా వాదనలు విన్న అనంతరం హైకోర్టు, కేటీఆర్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో కేటీఆర్‌కు ఊరట లభించింది.