బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ ఏరియాలో ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా దేవాలయం సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని ప్రముఖ సీని గేయ రచయిత, బలగం సినిమా నటుడు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డెపల్లి కృష్ణ మాట్లాడారు. గత రెండేళ్లుగా ఈ మద్యం షాపును తరలించాలని పోరాటం చేస్తున్న.. అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. తన ఇంటి పక్కనే ఈ మద్యం షాపుఉండటంతో చాలా ఇబ్బందిగా ఉందని.. కనీసం ఇంటి అద్దెకు కూడా ఎవరు రావడం లేదన్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుపైన వాహనాలు ఆపుతున్నరని, మందు బాబుల చేష్టలతో మహిళలు ఇబ్బందులకు గురౌతున్నరన్నారు. సిరిసిల్ల కలెక్టర్ స్పందించి ప్రజలకు ఇబ్బంది లేని చోటకు మద్యం షాపును తరలించాని వేడుకున్నారు