జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిత
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.హరిత కోరారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు.
కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిక్కచ్చిగా, పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి నిర్వహించుకోవాలని కోరారు. మన జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, డీపీఓ షర్ఫుద్దీన్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు,
తదితరులు పాల్గొన్నారు.


